నంద్యాల: జిల్లా పరిధిలో నకిలీ విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై బెదిరింపులకు పాల్పడడం మానుకోవాలని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బండి ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి సంఘాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.