త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో అమర్నాథ్ తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మరోవైపు.. అమర్నాథ్గౌడ్కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2017 నుంచి ఇప్పటివరకు ఆయన 92వేల కేసులు పరిష్కరించారు.