మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నాందేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నాందేడ్‌లోని సిక్కు దేవాలయమైన గురుద్వారాను జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కలిసి సందర్శించారు. వారికి అక్కడి నాయకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.