మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అమరావతికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన బ్యాగులు, ఇళ్లనే తనిఖీ చేస్తున్నారని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఉద్ధవ్ ఆరోపణలను ఖండించిన బీజేపీ.. కేంద్రమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం శిండే, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ బ్యాగులూ తనిఖీ చేశారని వెల్లడించారు.