ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద శనివారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా శనివారం ఉదయం గొయ్యులు తవ్వి పనులు పూర్తి చెయ్యకుండా వదిలేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు వాహనదారులు తెలిపారు. అరకులోయ పాడేరు ప్రధాన రహదారి కావడంతో రాకపోకలు సాగించే వాహనదారులు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు.