CTR: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ టి వినోద్ కుమార్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.