AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నట్లు తెలిపారు. రామ్మూర్తి నాయుడు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.