మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిపేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఇటుక పేర్చుతూ మహారాష్ట్రను నిర్మించిందని వ్యాఖ్యానించారు. అయితే, మహాయుతి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఓ కార్యక్రమంలో ఆరోపించారు.