ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈనెల 26న ఏలూరు జిల్లా కలెక్టర్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.