ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ పేరును పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది. సినిమా, రాజకీయ, సామాజిక సేవ కోటాలో ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వం బాలకృష్ణ పేరును కేంద్రానికి పంపించింది. బాలకృష్ణతో పాటు పలువురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. 2025 జనవరి 16న కేంద్రం విజేతలను ప్రకటించనుంది.