AP: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లపై అభ్యంతకర పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై జిల్లా ఎస్పీ దామోదర్ స్పందించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 19న హాజరుకావాలని చెప్పినట్లు వివరించారు.