జామిలోని అన్నంరాజుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జేసీ సేతుమాధవన్ శనివారం సందర్శించి కంప్యూటరీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలోని మొత్తం 65 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అకౌంట్ల కంప్యూటరీకరణ నవంబరు 20 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావల్సిందేనని అన్నారు. ఆధార్ అనుసంధానంలో తహసీల్దార్లు సహకరించాలన్నారు.