TG: కాంగ్రెస్ సర్కార్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందని జాగో తెలంగాణ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రూ.15 వేలు రాకపాయే.. రుణమాణీ రూ.2 లక్షలు ఎక్కడపాయే.. ఉచిత కరెంటు మాయమాయే.. ధాన్యం క్వింటాకు రూ.500 ఇయ్యకపాయే అని ట్వీట్లో విమర్శించారు.