AP: సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఢిల్లీలోని కాంక్లేవ్ ముగియగానే చంద్రబాబు మధ్యాహ్నానికి నేరుగా హైదరాబాద్లోని AIG ఆస్పత్రికి రానున్నట్లు సమాచారం. కాగా, రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయాల్సి ఉండగా షెడ్యూల్లో మార్పు చేసినట్లు సమాచారం.