TG: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా రంగానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్షరమే.. ఆయుధమని, నిజాలను నిగ్గు తేల్చి.. అన్యాయాలకు అడ్డుకట్టవేసి.. అక్రమాలను చక్కదిద్దే సామాజిక రక్షక తంత్రాలు.. చైతన్య కారక యంత్రాలు పత్రికలు అని కొనియాడారు. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్నట్లు నిరంతరం సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పత్రిక అని పేర్కొన్నారు.