AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్నారు. దీంతో అసెంబ్లీ నుంచి మంత్రి నారా లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా.. హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.