TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 6 నుంచి 10 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుందని పేర్కొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు చినుకులు పడే అవకాశం ఉందని పేర్కొంది.