ఉత్తరప్రదేశ్లోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 10 మంది శిశువులు మృతిచెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయవిదారకంగా ఉందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.