MDK: ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈ నెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.