AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది టీచర్లకు విద్యాశాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఉపాధ్యాయులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడుతున్నామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. మాజీ సీఎం జగన్ హయాంలో వేతన బకాయిలు, డీఏ బకాయిలు, 2019 నాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఉద్యమించడంతో కేసులు నమోదైన విషయం తెలిసిందే.