చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటినుంచే నీరసంగా, అలసటతో, బద్ధకంగా కనిపిస్తారు. రాత్రి పడుకునేటప్పుడు చాలా మంది ఫోన్లు చూస్తూ పడుకుంటారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూలైట్ ప్రభావం నిద్రపై పడుతుంది. దీంతో సరిపడ విశ్రాంతి లేక ఉదయాన్నే అలసటగా అనిపిస్తుంది. శరీరంలో తేమ శాతం తగ్గినా.. థైరాయిడ్ సమస్య ఉన్నా.. పోషకాలు లోపించినా.. అలసటకు గురవుతుంది. గాఢమైన నిద్ర పట్టాలంటే.. యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. తాజా పండ్లు, కూరగాయలు తినాలి.