VSP: రాష్ట్ర బడ్జెట్లో విద్యకు ఈ ఏడాది రూ.29,000 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఎన్ఏడీ జంక్షన్ వద్ద నూతన విద్య వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం విజయం కోసం కాదని అన్నారు. సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం అన్నారు.