AP: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత IAS రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించింది. సుప్రీంకోర్టు SC వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్గీకరణపై 60 రోజుల్లో నివేదించాలని కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. SC ఉపకులాల్లో వెనుకబాటుతనం వంటివి పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏ అంశాలు పరిశీలించాలో కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.