GNTR: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శనివారం గుంటూరు రానున్నారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రాజాగారితోటలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కావున పార్టీ నాయకులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.