HYD: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి లక్నో మధ్య ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం 6 గంటలకు లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఈనెల 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.