సత్యసాయి: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో సవితను ఇటీవల కురుబ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులైన దేవంద్రప్ప కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పరిధిలో అమలు చేస్తున్న పథకాలను అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.