ATP: ఆడపిల్లల రక్షణ, భద్రతకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ ఇంటిగ్రేటెడ్ మహిళాసాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు, సహాయం కావలసిన వారికి పునరావాసం, భద్రత కల్పించడానికి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.