AP: 10 లక్షల మంది జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధన సవరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమై రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలపై చర్చించారు. ‘దాదాపు రూ.40 వేల కోట్ల ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖలో నైపర్ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ వెళ్లేవారికి సీమలో ఆరోగ్య పరీక్షలు చేసేలా ఏర్పాటు కోరాను. మంత్రి సానుకూలంగా పరిశీల...
ATP: నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు 40 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 20 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డేవిడ్, సిబ్బంది పాల్గొన్నారు.
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతన పల్లెవెలుగు బస్సును ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిడుగురాళ్ల నుంచి గుంటూరుకు సర్వీస్ ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం జానపాడు రోడ్డులోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన డీఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సామేలు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ రవి పాల్గొన్నారు.
E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జేసీ ఎస్.చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జేసీ, డీఆర్ఓతో కలసి ప్రజల నుండి మొత్తం 126 అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత సమయంలోనే పరిస్కరించాలని సూచించారు.
HYD: రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో కేటగిరీల వారీగా పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని స్పష్టం చేశారు.
AP: 2024 ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తు చేస్తూ విజయమ్మను చంపేందుకు జగన్ కుట్ర చేశాడని టీడీపీ ఆరోపించింది. దీనిపై విజయమ్మ లెటర్ విడుదల చేశారు. ఈ దుష్ప్రచారం ఆమెను కలచివేస్తోందని తెలిపారు. తనను అడ్డం పెట్టుకొని చేస్తున్న నీచ రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని వాపోయారు. ఎప్పుడో జరిగిన కారు ప్రమాదం ద్వారా లబ్ధి పొందాలనే ఆ...
NRPT: నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళ సంఘాలు ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ చంద్రకాంత్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక లాభాలు పొందుతారని, మహిళలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
CTR: పీలేరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 30న చికిత్సకి వెళ్లిన ఓ మహిళ మృతి చెందిన ఘటనపై రెండోసారి విచారణకు కలెక్టర్ ఆదేశించారని సీపీఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు మురళీ తెలిపారు. బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసినట్టు చెప్పారు. గతంలో చేపట్టిన విచారణ ఏకపక్షంగా జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకు పోయామన్నారు.
HYD: ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లను నియమించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే పర్యటన చేసి కొనుగోలును పరిశీలించాలని, రోజు వారీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎంకు మిగతా శాఖలపై.. స్పందించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాలని తెలిపారు. సీఎం చంద్రబాబు అందరినీ కోఆర్డినేట్ చేయగలరని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ అలజడి రేపిన విషయం తెలిసిందే.
ADB: ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని బేల మండల కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ రాజర్షిషాకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ.. ఇటీవల బేల మండల కేంద్రంలో ప్రభుత్వం అందించే దండారి ఉత్సవాల చెక్కుల పంపిణీలో ఐటీడీఏ అధికారులు సీఎం, జిల్లా ఇంచార్జీ మంత్రి ఫోటోలు పెట్టలేదన్నారు.
E.G: ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కి హాజరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం పాల్గొని పలు అంశాలు ప్రస్తావించారు. కామన్వెల్త్ మహిళా పార్లమెంటు స్టీరింగ్ కమిటి చర్చల్లో భారత్ తరపున పాల్గొనే అవకాశం రావడం గర్వించదగ్గ విషయంగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
KMM: కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ బీసీ కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
KMR: మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని, సోమవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. యూనివర్సిటీలను మరింత బలోపేతం చేయాలన్నారు.