AP: 2024 ఎన్నికల ముందు వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తు చేస్తూ విజయమ్మను చంపేందుకు జగన్ కుట్ర చేశాడని టీడీపీ ఆరోపించింది. దీనిపై విజయమ్మ లెటర్ విడుదల చేశారు. ఈ దుష్ప్రచారం ఆమెను కలచివేస్తోందని తెలిపారు. తనను అడ్డం పెట్టుకొని చేస్తున్న నీచ రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని వాపోయారు. ఎప్పుడో జరిగిన కారు ప్రమాదం ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన దుర్మార్గమన్నారు.