ELR: చింతలపూడి మండలం వడ్డెర గూడెంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. వడ్డెర గూడెం గ్రామానికి చెందిన చిన్న తిరపతయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సారా తయారీ నిర్వహించిన మరియు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 14 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ సహకార శాఖ మరియు ఆగ్రోస్ సమన్వయ సమావేశం నేడు నిర్వహించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ సంస్థల విత్తనాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
ELR: దెందులూరు తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ వినుతులను అందజేశారు. అనంతరం MLA మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయటం చేశారు.
ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాయదుర్గం పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి అర్థనగ్న ప్రదర్శనతో కొత్త మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నవంబర్ 5న ప్రకటిస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
VSP: జీవీఎంసీ 93 నుంచి 98 వరకు గల వార్డుల పరిధిలో సమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వేపగుంట జీవీఎంసీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. తాగునీరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ తదితర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
NRML: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను వారు ఆదేశించారు.
నంద్యాల జిల్లాలో శంకుస్థాపన చేసిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనుల శాఖ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP: సాగునీటి సంఘాలు, కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కర్నూలు జిల్లా కూటమి నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో కూటమి గెలిచిందని తెలిపారు. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ 93 శాతం స్ట్రైక్‌రేట్ దాటేలా పనిచేయాలని కోరారు.
NZB: మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ.. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సహకారంతో మాల సంఘం, మాదిగ సంఘం, పర్స సంఘం, వడ్డెర సంఘాలకు సంబంధించిన పనులకు సోమవారం భూమి పూజ చేశామన్నారు. అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు విషయంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పర్వతగిరి మండలం కల్లెడలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఎదుట గొడవకు దిగారు.
NRML: నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోదాం వద్ద భద్రత సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. గోదాం నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
KRNL: ఈనెల 18వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PLD: సత్తెనపల్లి మండలం మొలకలూరు-గొల్లపాడు మధ్యలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య, భర్తకు గాయాలయ్యాయి. భర్తకు కాలు విరిగింది. ఇద్దరికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.