• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి నుంచి ‘సీఎం కప్‌-2024’ పోటీలు

TG: రాష్ట్రస్థాయి సీఎం కప్-2024 పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2 తేదీ వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. రాష్ట్రస్థాయిలో 36 విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా విభాగాల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచినవారు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి.

December 27, 2024 / 06:45 AM IST

ప్రమాదానికి గురైన బస్సు, లారీలో డీజిల్ స్వాహా

GNTR: వినుకొండ శివారులో ఆర్టీసీ బస్సులో దుండగులు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మండలంలోని ఏ.కొత్తపాలెం శివారులో ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు, లారీలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వినుకొండ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు అక్కడే ఉన్నాయి.

December 27, 2024 / 06:45 AM IST

మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

WG: మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొవ్వూరు మండలం వాడపల్లిలో గురువారం జరిగింది. వాడపల్లిలో ఓ పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడైన పాస్టర్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

December 27, 2024 / 06:43 AM IST

రైతుల పొట్ట కొట్టొద్దు ఇంటూరి: బుర్రా

ప్రకాశం: చేపల మాయలో పడి రాళ్ళపాడు ఆయకట్టు రైతుల పొట్ట కొట్టవద్దని మాజీ MLA బుర్రా, MLA ఇంటూరి నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు. గురువారం కందుకూరు YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళపాడు ప్రాజెక్ట్ సమస్యను తాను రాజకీయం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.

December 27, 2024 / 06:42 AM IST

నాయుడుపేటలో మోస్తరు వర్షం

NLR: నాయుడుపేటలో రాత్రి 10 గంటల నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. విశాఖపట్నం వాతావరణ శాఖ సూచన మేరకు ఇప్పటికే అన్ని పోర్టల్ నందు అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

December 27, 2024 / 06:42 AM IST

ఇంటికెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి

మేడ్చల్: మూడుచింతల పల్లి కొల్తూరుకు చెందిన గణేశ్ (25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం.. గురువారం సాయంత్రం డ్యూటీ అనంతరం బైక్ పై ఇంటికి వెళుతున్నాడు. శామీర్ పేట PS పరిధిలో కేశవరం సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

December 27, 2024 / 06:40 AM IST

ఈనెల 31న సాధారణ సమావేశం

KKD: పెద్దాపురం పురపాలిక పాలక మండలి సర్వసభ్య సమావేశం ఈనెల 31న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పద్మావతి అన్నారు. ఛైర్‌పర్సన్ తులసీ మంగతాయారు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ సమావేశానికి విధిగా కౌన్సిల్ సభ్యులు, ఆయా విభాగాల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

December 27, 2024 / 06:39 AM IST

YVU పీజీ పరీక్షల తేదీల్లో మార్పులు

KDP: ఈనెల 30 నుంచి జరగాల్సిన యోగి వేమన యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు 2025 జనవరి 21వ తేదీ నుంచి జరుగుతాయని ప్రిన్సిపాల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped పస్ట్ సెమిస్టర్ల విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

December 27, 2024 / 06:37 AM IST

నేడు కేంద్ర కేబినెట్ భేటీ

కేంద్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అయితే గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఇవాళ అధికారిక కార్యక్రమాలను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది.

December 27, 2024 / 06:35 AM IST

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేటలోని యల్లమంద గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

December 27, 2024 / 06:32 AM IST

అల్లూరి జిల్లాలో కాఫీ తయారీ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలి

అల్లూరి జిల్లాలో కాఫీ తయారీ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన దిశా జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పరిధిలో పండే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మంచి పేరు ఉందని, అలాంటి అరకు కాఫీ తయారీ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

December 27, 2024 / 06:30 AM IST

ప్రభుత్వ పథకాలు రానివారికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయి

VSP: అరకులోయ మండలంలో గురువారం కొత్తభల్లుగూడ పంచాయితీ, గన్నెల పంచాయితీలలో రెవెన్యూ సదస్సులు జరిగాయని తాహశీల్దార్ ఎంవివి ప్రసాద్ తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులకు ఆర్ఐ బలరాం, డీటీ గోవిందు, సర్వేయర్ శ్రీనివాస్ హజరయ్యారు. భూ సమస్యలతో సంక్షేమ పథకాలు అందనివారు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. ఈ సదస్సులకు 68 ఆర్జీలు వచ్చాయన్నారు.

December 27, 2024 / 06:28 AM IST

బాపట్ల జిల్లాలో నేడు ప్రత్యేక గ్రీవెన్స్

బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈనెల 27వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్.టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

December 27, 2024 / 06:28 AM IST

‘నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్టుదే’

AP: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అమల్లోకి వచ్చేవరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్టుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు..  రెండు రాష్ట్రాల నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

December 27, 2024 / 06:26 AM IST

‘నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదే’

AP: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అమల్లోకి వచ్చేవరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు..  రెండు రాష్ట్రాల నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

December 27, 2024 / 06:26 AM IST