బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈనెల 27వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్.టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.