KKD: పెద్దాపురం పురపాలిక పాలక మండలి సర్వసభ్య సమావేశం ఈనెల 31న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పద్మావతి అన్నారు. ఛైర్పర్సన్ తులసీ మంగతాయారు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ సమావేశానికి విధిగా కౌన్సిల్ సభ్యులు, ఆయా విభాగాల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.