కాకినాడ: స్థానిక భానుగుడి సెంటర్లోని సైస్ కంప్యూటర్ సెంటర్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ జె.బాబి తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, సీఎస్ఆర్ పథకంలో శిక్షణ ఇస్తామన్నారు. ట్యాలీ, కంప్యూటర్ అసిస్టెంట్, రిటైల్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 30లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9299907346 సంప్రదించాలన్నారు.