WGL: చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఋణాల పంపిణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి సోమవారం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పైరవీలు లేకుండా ఎకరానికి రూ.50 వేలు రుణం ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతామనీ, అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
KKD: జగ్గంపేట, గండేపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధి నందు డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పట్టుపడిన వారిపై కేసులు నమోదు చేశారు. వారిని సోమవారం పెద్దాపురం కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ జీ.కృష్ణ శేషచార్య ఆరుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే మరో నలుగురికి రెండు రోజులపాటు జైలు శిక్ష విధించారు.
HYD: నాగోల్‌లో తమకు ఉచిత పార్కింగ్ కొనసాగించాలని, అలాగే కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించే బాధ్యత ఎల్&టీ మెట్రో సంస్థదేనని, ప్రభుత్వ భూమిలో పార్కింగ్ ఫీజు వసూలు చేయడమేంటని ప్రయాణికులు ప్రశ్నించారు. పార్కింగ్ ఫీజు చెల్లించినా వాహనాల రక్షణతో తమకు సంబంధం లేదని నిర్వాహకులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, వేరే చోటుకు తరలించాలని కోరుతూ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక జేఏసీ నాయకులు సోమవారం దిలావర్పూర్ మండల కేంద్రంలో ఎమ్మార్వో స్వాతికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. యాజమాన్యం తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారని ఆరోపించారు.
SKLM : నందిగాం మండలం దేవుపురం గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో ఆశ వర్కర్లు విధులు నిర్వహించడంతో అంగన్వాడి చిన్నారులకు ఇబ్బందికరంగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు కే ప్రవీణ్, టి.కోదండ తదితరులు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. అంగన్వాడి గదిలోనే మందులు ఉంచడంతో చిన్నారులకు ఆ మందులు వాసన పడట్లేదని వాపోయారు. ఉన్నతాధికారులు ఈసమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని కురిడి స్వయంభం శ్రీ మళ్లీ కార్జున స్వామి వారి ఆలయంలో మొదటి సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్తిక మాసములో భక్తుల స్తోత్రనామములతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. డుంబ్రిగూడ,అరుకువేలి, మకుంపేంట మండలాలు నుండి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తారు.
VZM: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సౌత్ సెంట్రల్ రైల్వే సలహా మండలి సభ్యులు అంబల్ల శ్రీరాములనాయుడు ఆ పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. ఈ మేరకు విజయనగరం, గజపతినగరం మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్యతో పాటు కొంతమంది నాయకులను సోమవారం కలిశారు.
JN: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియని వారు.. ప్రతీ నెల చివరి వారంలో జరిగే సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఆరోజు వివిధ చట్టాలపై అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు.
SKLM: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు.సోమవారం గేదెలవానిపేటలో గ్రామంలో రెవిన్యూ గ్రామ సదస్సును ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూ సర్వేలో జరిగిన లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు వినియోగించుకోవాలన్నారు.
NRML: దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారనే కారణంతో విజయ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమవారం రిలే దీక్ష వద్ద జేఏసీ నాయకులు సస్పెండ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
NTR: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సోమవారం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా చారుగండ్ల ప్రసాద్, డైరెక్టర్లుగా జెల్లి కృష్ణ, షేక్ షేహనాజ్ బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారిని అభినందించారు.
ప్రకాశం: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, బంగారం చోరీ కేసుల్లోని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలి సమీపంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద 1.3 కేజీల గంజాయి,300 గ్రాముల బంగారం, బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ASR: అరకు పార్లమెంటు పరిధిలో పాల కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా సవర చంటిబాబును నియమించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు చంటిబాబు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు శక్తిమేర శ్రమిస్తానని తెలియజేశారు.
AP: గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. మంత్రులు, జడ్జిలు, ఇతర బంగ్లాలకు రూ.41 వేల కోట్ల టెండర్లు వచ్చాయన్నారు. రూ.30 వేల కోట్ల టెండర్లకు సంబంధించి పనులు మొదలయ్యాయని అన్నారు. 2014-19 సమయంలో టెండర్ ఇచ్చిన పనుల గడువు ముగిసిందని చెప్పారు. పనులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. డిసెంబర్ చివరిలోగా అన్ని టెండర్లు పిలవాలని ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్‌లో బ్యాలెట్ పేపర్లపై భారతీయ భాష ఉండనుంది. భారతీయ బాష అయిన బెంగాలీ భాషకు ఈ ఎన్నికల్లో చోటుదక్కింది. ఇంగ్లీష్ కాకుండా మరో నాలుగు భాషలకు న్యూయార్క్ చోటు కల్పించింది. దీంతో చైనీస్, స్పానీష్, కొరియన్‌తో పాటు బెంగాలీ భాషల్లో బ్యాలెట్‌లు ఉండనున్నాయి.