JGL: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు ప్రజెంటేషన్ భాగంగా జగిత్యాల పట్టణానికి చెందిన సామాజికవేత్త బీరెల్లి స్వప్నకు 15వ స్థానం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్మ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్య ఉమెన్ అవార్డును స్వప్నకు గురువారం అందజేశారు.
కామారెడ్డి: పట్టణంలోని ఓ స్వీట్ హోమ్‌లో స్వీట్లలో స్కబ్బర్ వచ్చిందని ఈనెల 24వ తేదిన ఫిర్యాదు వచ్చిందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రముఖ స్వీట్ హౌస్‌ని తనిఖీ చేశారు. కొన్ని అనుమానిత నమూనాలు సేకరించి ల్యాబ్‌కి పంపించినట్లు చెప్పారు. ఇటువంటి తప్పిధాలు జరగకుండా ఉండాలని స్వీట్ హోమ్ యజమానులను హెచ్చరించారు.
NTR: విజయవాడలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బావాజీ పేటలో నివాసముంటున్న లీలకుమారి అనే మహిళ ఇటీవల హైదరాబాద్ వెళ్లి ఈనెల 25వ తేదీన తిరిగి వచ్చింది. వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన రూ.30 వేల నగదు, సెల్‌ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NDL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల నంద్యాల MP డా.బైరెడ్డి శబరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘డా.మన్మోహన్ సింగ్ జి మరణం దేశానికి తీరని లోటు మిగిల్చింది. ఆయన జ్ఞానం, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం దేశంపై చెరగని ముద్రవేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.
NRML: సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహించే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో జాప్యం చేయడంతో సమ్మెను ఉధృతం చేసే క్రమంలో బోధన బోధనేతర సిబ్బంది శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగారు. దీంతో విద్యాబోధన నిలిచిపోనుంది.
WGL: బైకును కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్‌కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందాడు.
✦ 1987 పద్మ విభూషణ్✦ 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ, ఆసియా మనీ అవార్డు✦ 2002 అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు✦ 2006 ఇండియన్ ఆఫ్ ది ఇయర్✦ 2010 వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు✦ 2017 ఇందిరా గాంధీ బహుమతి✦ ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు
ప్రకాశం: అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్ పురం గ్రామం నుంచి నాగులవరం గ్రామం వెళ్ళే రోడ్డులో గురువారం రాత్రి 11గంటలకు చిరుత సంచారం కలకలం రేపుతోంది. కంభం నుంచి అర్ధవీడుకు ముగ్గురు వ్యక్తులు కారులో వెళ్తుండగా మొహిద్దీన్ పురం సమీపంలో ఓ చిరుత అటుగా వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమీపంలో ఉన్న గొర్రెల కాపరులను హెచ్చరించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రస్ అథనోమ్ అక్కడే ఉన్నారు. కానీ ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. టెడ్రస్‌తో పాటు ఐరాసకు చెందిన ఉద్యోగులు విమానం ఎక్కడానికి వేచి ఉన్న టైంలోనే ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడిని ఐరాస తీవ్రంగా ఖండించింది.
KMM: ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా మంత్రి పొంగులేటి అధికార పర్యటన వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.
NGKL: కొల్లాపూర్ మండలంలోని సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌లో స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామని పర్యాటకశాఖ జిల్లా అధికారి నర్సింహ చెప్పారు. గురువారం దేవస్థానం అధికారి జైపాల్ రెడ్డితో కలిసి రిజర్వాయర్‌ను సందర్శించారు.
కృష్ణా: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు ఈ నెల 30వ తేదీ నుంచి మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్నాయని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దేహదారుఢ్య పరీక్షలు ప్రక్రియ మొత్తం ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
AKP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ప్రధాని మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు.
HYD: ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ జీ మరణవార్త గురించి విని చాలా బాధపడ్డాను. దేశ ఆర్థిక రంగాన్ని స్కేలింగ్ చేయడంలో మన్మోహన్ సహకారం అపారమైనది. కీలక ఆర్థిక సంస్కరణల అమలు సహా భారతదేశ వృద్ధి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఖ్యాతి రాజకీయాలకు అతీతంగా విస్తరించింది’ అని పేర్కొన్నారు.