ప్రకాశం: అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్ పురం గ్రామం నుంచి నాగులవరం గ్రామం వెళ్ళే రోడ్డులో గురువారం రాత్రి 11గంటలకు చిరుత సంచారం కలకలం రేపుతోంది. కంభం నుంచి అర్ధవీడుకు ముగ్గురు వ్యక్తులు కారులో వెళ్తుండగా మొహిద్దీన్ పురం సమీపంలో ఓ చిరుత అటుగా వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమీపంలో ఉన్న గొర్రెల కాపరులను హెచ్చరించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.