NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్‌లో వైసీపీ నాయకుడు మాదాల తిరుపతిరావు యాదవ్ టీడీపీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో మద్దతుదారులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, మాదాల తిరుపతిరావు యాదవ్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
PLD: మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు దీపం పథకం-2ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నట్లు స్థానిక టీడీపీ నాయకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తారన్నారు.
KNR: ఇటీవల అనారోగ్యంతో సర్జరీ అయిన ఓబీసీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొక్కుగంగాధర్‌ని సోమవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వారి నివాసంలో పరామర్శించారు. ఆయనతో పాటు పల్లె గంగారెడ్డి, మోరపెల్లి సత్యనారాయణరావు, భోగ శ్రావణి, డాక్టర్ రఘు, తదితరులు ఉన్నారు.
ASR: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా బంగారుమెట్ట గ్రామంలో దీపం-2.0 కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులతో ముచ్చటిస్తారు. కుమ్మరిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కిశోర వికాసం కార్యక్రమాన్ని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.
BHNG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి పంచనరసింహుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. సీఎం తన పుట్టిన రోజు సందర్భంగా వచ్చే శుక్రవారం రానున్నసమాచారంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హేలిప్యాడ్ ప్రాంగణానికి అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. దేవస్థానం ఈవో భాస్కరరావు సూచనలతో సివిల్ విభాగం కనుమ దారికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ వేసే పనులు చేపట్టింది.
SRD: వివాహాలు, ఇతర శుభకార్యాలు, విహారయాత్రల కోసం ఆర్టీసీ అద్దెలో తగ్గింపు చేసినట్లు జహీరాబాద్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ సోమవారం తెలిపారు. శబరిమలపల్లి అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహారయాత్రలు దర్శనీయ స్థలానికి వెళ్లే పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా 10 శాతం రాయితీ వర్తింప చేస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: కురబలకోట విశ్వం కళాశాల వద్ద ఆదివారం అర్థ రాత్రి కారు ఢీకొని బైక్ పై వెళ్తున్న అశోక్ కుమార్ (25) తీవ్రంగా గాయపడ్డట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. స్థానిక యనమలవారిపల్లికి చెందిన అశోక్ కుమార్ బెంగళూరుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యలోని అంగళ్లు విశ్వం కళాశాల వద్ద కారు ఢీకొనడంతో మదనపల్లెకు తరలించారు.
KMM: ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ప్రాంతంలోని గురుదక్షిణ ఫౌండేషన్ లో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆదివారం పర్యటించారు. గురు దక్షిణ ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు చేకూరి కాశయ్య విగ్రహంతో పాటు ఎస్వి నారాయణ విగ్రహాన్ని ఎంపీ ఆవిష్కరించారు. డిజిటల్ గ్రంథాలయం, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం పట్ల ఆదివారం పాలమూరు యూనివర్సిటీ JAC నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో నిధులను విడుదల చేసి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2020లో ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోకుండా ఉండాల్సిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన పదవీకాలంలో అమెరికా అధ్యక్షుడిగా చాలా అద్భుతంగా పని చేశానన్న ఆయన.. వైట్‌హౌస్‌లోనే ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. పెన్సిల్వేనియా సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఫేక్ న్యూస్’లతో తనపై అనవసర విమర్శలు చేసినా పట్టించ...
WNP: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై రాము అన్నారు. రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆదివారం అవగాహన కల్పించారు. గ్రామస్తుడు కొండల్ గౌడ్ సీసీ కెమెరాలు చూసేందుకు టీవీ విరాళంగా ఇచ్చారు. అలాగే గ్రామస్థులు రూ.1.50 లక్ష నగదు విరాళంగా అందించారు.
జనగాం: అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్‌కు ఎంపికైన క్రీడాకారునికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కరాటే క్రీడాకారుడు సార్ధక్ కుమార్ ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆదివారం ఆర్థిక సహాయం చేశారు. జాఫర్ గడ్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన సార్ధక్ కుమార్ ఈనెల 6వ తేదీన గోవాలో జరగనున్న అంతర్జాతీయ వరల్డ్ కప్ కరాటే ఛాంపియన్‌కు ఎంపికయ్యారు.
SRPT: టేకుమట్లలోని పాత బ్రిడ్జి పైనుంచి దూకిన విజయవాడ యువకుడు యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, అతని శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి సమాచారం ఇచ్చామని కేతేపల్లి ఎస్సై శివతేజ తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న యశ్వంత్.. బైక్ అక్కడే నిలిపి రెయిలింగ్ పైనుంచి మూసీ నదిలో దూకాడు.
WGL: వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించు కోవచ్చన్నారు.
KMR: గాంధారి మండలం ముదేల్లి ఎక్స్ రోడ్డు, ముదేల్లి గ్రామాలను పొగమంచు కమ్మేసింది. కార్తీక మాసం ప్రారంభ సమయంలో చలి తీవ్రత పెరగడంతో సోమవారం ఉదయం గ్రామంలో పొగమంచు కురిసింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారు పొలాలకు వెళ్లే వారికి ఆ దృశ్యాలు కనువిందు చేశాయి.