MDK: పాపన్నపేట మండలం నాగ్‌సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు కార్తీక మాసం మొదటి సోమవారం తదియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందు వాసరే పురస్కరించుకొని ఆలయ ఆచార సాంప్రదాయ పద్ధతిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. అనంతరం మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు.
KNR: కరీంనగర్ కు బోధన్ నుంచి రైలు ప్రారంభమైంది. రైల్ నెంబర్ 07893 ఇది బోధన్‌లో ఉ.4.15గంటలకు ప్రతిరోజు బయలుదేరి కరీంనగర్‌కు ఉ. 8 గంటలకు చేరుకోనుంది. బోధన్ నుంచి నిజామాబాద్ మీదుగా కరీంనగర్ టూ సిర్పూర్ కాగాజ్నగర్ వరకు ఈ రైలు పట్టాలెక్కడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
MLG: జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
VZM: పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో ఆలయ అర్చకులు శివుడికి పాలు, పెరుగు, తేనే, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.
KNR: రైతులు వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు.బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆదివారం నూతన పాల కేంద్ర భవనాన్ని కరీంనగర్ జిల్లా డైరీ ఛైర్మన్ చల్మెడ రాజేశ్వరరావుతో ఆయన కలిసి ప్రారంభించారు.పాడి పరిశ్రమకు పోటీ లేదని, ప్రతి రైతు పాడి పరిశ్రమపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలన్నారు.
ELR: అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నీలాద్రిపురానికి చెందిన మాధురికి నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందినసుధాకర్ అలియాస్ మహేశ్ మూడేళ్ల కిందటవివాహం జరిగింది. అప్పుడు కొంత మొత్తం కట్నంగాఇచ్చారు. ఆదివారం చేబ్రోలు పోలీసులకు పిర్యాదు చేశారు.
KDP: ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో మడూరు రోడ్డు క్రాస్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాపాడు మండలం మడూరుకు చెందిన మహబూబ్ షరీఫ్ (50) మృతి చెందాడు. ప్రొద్దుటూరు నుంచి తన స్వగ్రామం మడూరుకు టీవీఎస్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా జమ్మలమడుగు వైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. తలకు గాయాలై మహబూబ్ షరీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు.
కోనసీమ: తొలి కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి తూ.గో జిల్లాలోని శివాలయాలకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈవో లక్ష్మీనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ఈ నెలంతా నదీ స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు చేయడం చాలా మంచిదని, శుభ ఫలితాలు వస్తాయని అర్చకులు తెలిపారు.
నెల్లూరు: సోమశిల జలాశయంలో నీటినిల్వ 70 టీఎంసీల స్థాయిని దాటింది. ప్రస్తుతం జలాశయంలోకి 20,234 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం నుంచి కండలేరుకు 10వేల క్యూసెక్కులు, సంగం ఆనకట్టకు 2,100, ఉత్తరకాలువకు 700 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా జలాశయానికి ఇప్పటికే 110 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 40 టీఎంసీలు కండలేరుకు తరలించారు.
నెల్లూరు: పొదలకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు పీఎం సూర్యఘర్‌పై సమావేశం నిర్వహిస్తామని విద్యుత్ డీఈ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.
TG: ఉమ్మడి జిల్లాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ వాయిదా పడింది. ఈనెల 11న కొన్ని జిల్లాల్లో జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా అయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జరగాల్సిన విచారణ వాయిదా వేశారు. బీసీ కులగనణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్లే వాయిదా వేస్తున్నట్లు బీసీ కమిషన్ తెలిపింది. సవరించిన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
NTR: 11 కేవీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఫీడర్, స్క్రూ బ్రిడ్జి విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో సోమవారం విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బెంజి సర్కిల్, మైత్రేయవీధి, శ్రీరాంనగర్, చంద్రమౌళిపురం MG రోడ్, ఫకీరుగూడెం, ప్రగతినగర్ లో విద్యుత్ సరఫరా ఉండదని EE పి. రవీంద్రబాబు చెప్పారు. ఆయా ప్రాంతాల వారు సహకరించాలని ఆయన కోరారు.
ఖమ్మం: నగరంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ తెలిపారు. ముందుగా మంత్రి తుమ్మల ముస్తాఫనగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఇక ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
HYD: హైదర్నగర్ గ్రామ పరిధిలోని దర్గా వద్ద ముస్లిం మైనార్టీ ప్రజలు పెద్దయెత్తున నిర్వహించిన గ్యార్వీ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని మత సామరస్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
MBNR: మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో ఆదివారం జరిగింది. CI గాంధీ కథనం.. MBNR లోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు (3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. గమనించి పోలీసులకు అప్పగించారు.