కృష్ణా: పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో రూ. 4 కోట్ల 20 లక్షల నిధులతో 33/11KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.
BDK: కొత్తగూడెం మేదర బస్తీలో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంచార జాతులుగా ఉన్న బంజారాలను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏకతాటిపైకి తెచ్చారని గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి భోగ్ భండారో పూజలు నిర్వహించి నివాళులర్పించారు.
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని, సాంకేతిక లోపాలతోనే కొన్ని, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లులు నిలిచిపోయాయని ఆమె సృష్టం చేశారు.
PDPL: మంథని నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 1,00,09,000 విలువైన 266 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని 43, ముత్తారం 44, రామగిరి 44, కమాన్‌పూర్ 23, పాలకుర్తి 8 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78 మందికి చెక్కులు అందనున్నాయని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మెట్రో ఫేజ్-2, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. సబర్మతి, గంగా నదుల పునరుజ్జీవం కోసం అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించలేదా? అని ప్రశ్నించారు.
SDPT: మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో గోటి తలంబ్రాల కార్యక్రమంపై ఆదివారం గజ్వేల్‌కి చెందిన రామకోటి రామరాజు సమావేశం నిర్వహించారు. శ్రీరామనవనాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అవసరమయ్యే గూటితో వచ్చిన తలంబ్రాలు వాడుతారని రామరాజు తెలిపారు. కోటి తలంబ్రాలు దీక్ష వచ్చే శనివారం భారీ ఎత్తున ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత రెండు సిరీస్‌ల్లో సౌతాఫ్రికాపై వరుణ్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 22 వికెట్లు పడగొట్టి, సఫారీ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా సత్తా చాటాడు.
SRPT: ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు ఇంటర్ ప్రశ్న పత్రాలను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా నడుమన తీసుకువచ్చారు. జూనియర్ కళాశాలలకి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.
AP: గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య పాల్గొన్నారు. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తపాలా వ్యవస్థను గ్రామీణులు ఇంకా ఆదరిస్తున్నారని తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు మరిచిపోలేమన్నారు. MP, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో గ్రామీణ డాక్ సేవక్ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.
ప్రకాశం: కనిగిరిలో రౌడీ షీటర్లు, లైంగిక నేరస్తులపై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరప్రవర్తనకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంచి పౌరులుగా మారి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచిస్తూ, ఇకపై నేరాలకు పాల్పడబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.
VZM: విజయనగరంలోని 19వ డివిజన్‌కి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి. బాలాజీ నగర్ కార్యాలయంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత జనసేనలోకి రావడం శుభపరిణామన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ లోని పలు కాలనీలో సుమారు రూ. 4.5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు MLA KR నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. రోడ్లు-డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 4.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం వైసీపీ చేసిన మహా తప్పిదమన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతకరమని, దేవుళ్లను వాడుకుంటూ.. స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంతో వైసీపీ పతనం మొదలైందన్నారు.
NZB: నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ఆదివారం జిల్లా BJP ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా BJP అధ్యక్షుడు దినేశ్ కులచారి తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
AP: వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని YCP నేత MVS నాగిరెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన లెక్కలు చూస్తేనే ఈ విషయం అర్ధమవుతోందని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందని, కానీ అప్పట్లో YSR, జగన్ రుణ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్‌తో ఎప్పుడో చేశారని వెల్లడించారు.