BDK: మణుగూరు మండల పరిధిలోని సాంబాయిగూడెం నుండి పగిడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంతో ప్రమాద భరితంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షానికి బీటీ రోడ్డు కొట్టుకుపోగా అదే గుంత పెద్దగా తయారై ఆ రోడ్డుపై ప్రాణ సంకటంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో రోజుకొక అంశం తెర మీదకు వస్తోంది. మాయమైన రేషన్ బియ్యం మరింత పెరిగింది. తొలుత స్టాక్ రిజిష్టర్లను బట్టి 3708 బస్తాలు మాయమైనట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేయగా ఆ సంఖ్య 4048కి చేరింది.
BDK: మణుగూరు మండలం చిన్న రావి గూడెం ఇంటెక్ వెల్ సీల్ రిమూవింగ్ పనుల దృష్ట్యా మణుగూరు మున్సిపాలిటీలో ఆదివారం వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు గమనించి తమకు సహకరించాలని కోరారు.
TG: ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ పలువురిని అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే దానకిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా మాజీమంత్రి KTRపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది.
GDWL: జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, ప్రత్యేక అలంకరణ చేసి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
KMM: సాగర్ నీటి రాకతో పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 18.5 అడుగులకు చేరుకుంది. మొదటి జోన్ నుంచి 4, 272 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ రెండో జోన్ ఆయకట్టుకు 3,270 క్యూసెక్కుల నీరు పాత కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
SKLM: వీరఘట్టం మండలం నీలానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థి కొరికాన రవికుమార్ ఈ పాఠశాలకు రూ.5 లక్షల విలువైన ఆర్ఓ ప్లాంట్‌ను వితరణ చేశారు. ఈ ప్లాంట్‌ను డీఈవో తిరుపతి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్ధులు బాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో పర్రి కృష్ణమూర్తి, పాల్గొన్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగి విఫలమవడంతో బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా దిగాడు. అయితే కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లోనే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారగా.. రోహిత్ ఫెయిల్ కావడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి మొదటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేశారు. మండల పూజలు ముగియటంతో దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇప్పటివరకు 32.50 లక్షల మంది అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 30న ఆలయం మళ్లీ తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.
నెల్లూరులోని స్టేడియం వద్ద ఉన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న బస్సు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి తనిఖీలు చేపట్టుగా 12 కిలోల గంజాయి పట్టుబడిందని వెల్లడించారు. వివరాల ప్రకారం ఆరు ప్యాకెట్లలో ప్యాక్ చేశారని సదరు వ్యక్తిని అరెస్టు చేసామన్నారు.
VSP: పట్టణ అధికార భాష అమలు కమిటీ (టోలిక్) రాజభాష అమలు చేయడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జి సీఎండీ ఏకె సక్సేనా అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గురువారం టోలిక్ 16వ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-ప్రస్తుతి కిరణ్‌ను విడుదల చేశారు.
KDP: 4 రోజుల పర్యటనలో భాగంగా YS జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన నిన్న పులివెందులలోని తన నివాసంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. నేటి ఉదయం ఓ వివాహంలో సతీసమేతంగా వైయస్ జగన్ పాల్గొని, అనంతరం పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు.
WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే ఐదవ, మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల (డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.