NLG: పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా దేవరకొండ డీఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో గురువారం లయన్ ఐ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వస్కుల సత్యనారాయణ తెలిపారు. యువత, ప్రజలు రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు నిలబెట్టాలని కోరారు. ఉ. 9:30 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వయనాడ్ కల్ఫేటాలో మెగా ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతోపాటు CM రేవంత్ రెడ్డి, DY. CM భట్టి, కర్ణాటక CM సిద్ధరామయ్య, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, మ...
NLG: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు, విధి నిర్వహణపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్ర, వారి పనితీరు పట్ల వివరించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు.
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘సత్యం సుందరం’ మూవీ OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. దాన్ని ఈనెల 25కు షిఫ్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లలో 2:55 గంటలు నిడివితో రిలీజ్ ...
VSP: పాములను చూస్తే హడలి పారిపోతున్న నేపథ్యంలో విశాఖపట్నం స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ పాములు పట్టడంలో ఔత్సాహికులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పాములు పట్టుకోవడం నుంచి వాటిని బంధించేంతవరకు శిక్షణ ఉంటుంది. స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా పాములు పట్టడంలో ఉచితంగా శిక్షణ పొందారని ఆయన తెలిపారు.
GNTR: రాష్ట్ర టిడ్కో ఛైర్మన్‌గా అజయ్ కుమార్ బుధవారం అమరావతిలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ అజయ్ కుమార్‌ను అభినందించారు. ఆయనకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. టిడ్కో అభివృద్ధికి అజయ్ కృషి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
BDK: జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుకున్నారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. బుధవారం కొత్తగూడెం ఆర్టీసీ సూపర్డెంట్ కు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
SRCL: విద్యార్థులు నిత్యం తమ పాఠ్యాంశాలను చదువుతూ, రాస్తూ సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం పరీక్ష కోసం విద్యార్థులు చదువుతుండగా, పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
BPT: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ చెప్పారు. బుధవారం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
VZM: గజపతినగరంలోని ముగ్గురు టిఫిన్ దుకాణదారులతోపాటు ఒక చికెన్ సెంటర్ యజమానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు గజపతినగరం ఎంపీడీవో బి.కళ్యాణి తెలిపారు. బుధవారం గజపతినగరంలోని పలు వీధుల్లో గల పారిశుధ్యం పరిశీలించడంతోపాటు దుకాణాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు.
ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ దివాలా ప్రక్రియకు NCLAT బెంచ్ ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపేసింది. BCCIకి బైజూస్ చెల్లించాల్సిన రూ.158.9కోట్ల పెండింగ్ బిల్లుల నిర్ణయాన్ని కొట్టివేసి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశింది. 2023 నవంబర్ వరకు BCCIకి జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా వైదొలిగింది. కాంట్రాక్ట్ ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది బైజూస...
ఎడ్‌టెక్ సంస్థ BYJUS దివాలా ప్రక్రియకు NCLAT బెంచ్ ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపేసింది. BCCIకి BYJUS చెల్లించాల్సిన రూ.158.9 కోట్ల పెండింగ్ బిల్లుల నిర్ణయాన్ని కొట్టివేసి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. 2023 నవంబర్ వరకు BCCIకి జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా వైదొలిగింది. కాంట్రాక్ట్ ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది BYJ...
SRCL: తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచ్‌ల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య మాట్లాడుతూ. తమ పెండింగ్ బిల్లులను చెల్లించే వరకు దీక్ష విరమించబోమని తెలిపారు.
KDP: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని, నిందితునికి తొందరగా శిక్ష పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, బద్వేల్ నియోజకవర్గ సమన్వయ కర్త రితీశ్ రెడ్డి తెలిపారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు.
SKLM: హిరమండలం మండల పరిధి గొట్ట గ్రామంలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో P.M జన్మాన్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ హాస్టల్ నిర్మాణం పూర్తయితే గిరిజన విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.