MBNR: దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ గవర్నర్గా, పీవీ నరసింహారావు క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిష్ట పునాది వేశారన్నారు.