KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డి గురువారం హైదరాబాద్‌లో జీఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
KMM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ ప్రస్తుత పాకిస్తాన్‌లో పంజాబ్‌లోని గహ్‌లో 1932లో సిక్కు కుటుంబంలో జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయస్సులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ దగ్గర పెరిగారు. పాక్ నుంచి వచ్చి భారత ప్రధానిగా ఎన్నికై చరిత్ర కెక్కారు. సిక్కు సమాజం నుంచి భారత ప్రధానిగా ఎన్నికైన తొలి ప్రధానిగా ప్రసిద్ధి గాంచారు.
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా వర్షాలు కురవనున్నాయని IMD పేర్కొంది. శనివారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. గురువారం రాత్రి వరకు కావలిలో 80.75మి.మీ వర్షపాతం నమోదైంది.
KMM: జిల్లాలోని బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఛైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 16కంపెనీల బాధ్యులు పాల్గొని ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు 2020 నుండి ఇప్పటి వరకు బీటెక్, బీ పార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన పాల్గొనవచ్చని తెలిపారు.
పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావటం సాధారణం. కానీ కొంతమంది తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. అయితే భరించలేనంత నొప్పికి డిప్రెషన్ కారణమని ఓ అధ్యయనంలో తేలింది. డిప్రెషన్‌కి కారణమయ్యే జన్యువుల్లో కొన్ని పీరియడ్స్ నొప్పిని కలిగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భావోద్వేగాల్లో మార్పు నొప్పిని పెంచుతుందట. నిద్రలేమి సమస్య ఈ నొప్పిని మరింత ఎక్కువ చేస్తుందట.
కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లింగాపూర్ గ్రామం 11, 9వ వార్డుల బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత మార్పుల్లో భాగంగా 193వ బూత్ అధ్యక్షుడిగా సంగి రాజేందర్‌ను, 194 బూత్ అధ్యక్షుడిగా దుబాసి భూపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భరత్ పాల్గొన్నారు.
VZM: బొబ్బిలి సబ్ జైలులోని సౌకర్యాలను గురువారం కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ ఎమ్మార్ రవికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఉపకారాగారం శిథిలావస్థకు చేరుకుందని, ఎరకన్నదొరవలస వద్ద కొత్త జైలు నిర్మాణానికి హైకోర్టు సూచనల మేరకు రెవెన్యూ ఐదెకరాలు చూపించారని చెప్పారు. జిల్లా జైలర్ శివప్రసాద్, సూపరింటెండెంటు సీతారామ పాత్రో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న 9 మంది వైద్యులు, 15 మంది వివిధ క్యాటగిరీ సిబ్బంది తక్షణమే వారి వారి స్థానాలకు వెళ్లాలని DMHO వి. సుజాత ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లాలోని వివిధ PHCలలో పని చేసే అన్ని రకాల కేటగిరి సిబ్బంది డిప్యూటేషన్లు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
VZM: ఆసుపత్రుల వ్యవర్ధాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిబంధనలు పాటించని ఆసుపత్రులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా పర్యవేక్షక కమిటీ సమీక్షా సమావేశం గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలక ప్రక్రియ ప్రజారోగ్యానికి భంగం కలగకుండా తరలించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కంభం మండల రైతులు నిండా మునిగారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 3000 ఎకరాలలో శనగ, 500 ఎకరాలలో మిర్చి, పొగాకు పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పుచేసి మరి పెట్టుబడి పెట్టామని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోతున్నారు.
W.G: భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అకాల మృతి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వందల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రాత్రి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ప్రకాశం: స్కూల్ గేమ్స్ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఒంగోలుకు చెందిన శక్తి ధర్మ శ్రీచంద్ర బంగారు పతకం సాధించాడు. ఇటీవల విజయవాడలో జరిగిన అండర్ 17 పోటీలలో 120 కేజీల విభాగంలో అతను పతకం సాధించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అతనిని అభినందించారు.
NDL: శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి అని, భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తునట్లు పేర్కొన్నారు. TTD తరుపున ధర్మప్రచార నిధులను కేటాయించాలని, గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అన్నారు.
HYD: నాటి ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జీడీపీ వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనపరుడని ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం తెలిపారు.