SKLM: గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నేతలు ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తగిన వేతనాలు లేకపోవడం, సిబ్బందికి చెల్లించాల్సిన గ్రాట్యువిటీ, ఎర్న్ లీవ్ బకాయిలు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.