WNP: స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గోపాల్ పేట ఎస్సై నరేష్ ఆదివారం ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఓటును కొనడం, అమ్మడం చట్టరీత్యా పెద్ద నేరమని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా అటువంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670614కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.