TG: రాష్ట్రంలో విచిత్ర ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, హామీల వైఫల్యంలో రికార్డ్ బ్రేక్ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వంచించడమే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అన్నారు. గతంలో హైడ్రా, మూసీ పేరుతో.. ఇప్పుడు రైజింగ్ తెలంగాణతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని చెప్పారు.