WGL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఓటు ఎవరికి వేశారో లెక్కింపులో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండడంతో “ఎందుకొచ్చిన గొడవ” అంటూ చాలా మంది ఓటు వేయకుండానే ఉండాలని నిర్ణయించారు. గ్రామ వార్డుల్లో ఓటర్లు వందల్లోనే ఉండటంతో ఎవరికి ఓటు వేశారో అందరికీ తెలిసిపోతుందనే భయం ఉద్యోగులను కలవరపెడుతోంది.