KKD: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై నిరంతరం నిఘాపెట్టాలని కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భ్రూణహత్యలను నివారించాలన్నారు.
RR: ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకే సామాన్య జనంలో క్యూలో నిలబడి ఓపికగా తన ఓటు హక్కును వినియోగించుకోగా…ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా పాలకులను ఎంపిక చేసుకొని వారి ద్వారా పాలించుకునే గొప్ప ప్రజాస్వామ్యం మనదన్నారు.
BDK: అశ్వాపురం మండలం మొండికుంట పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం పోలింగ్ ఏజెంట్లకు పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్ సీల్ చూపించే ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి స్థానిక ప్రజలు ఓటును వినియోగించుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే ఏజెంట్ పాసులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నట్లు అన్నారు.
ASR: మన తాజంగి గ్రామం విక్కీ CSC మీసేవ లో ఆధార్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ITDA పాడేరు అన్ని రకముల ఆధార్ అప్డేట్లు చేయబడును. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్, చిన్నపిల్లలకు న్యూ ఎన్రోల్మెంట్, అడ్రస్ చేంజ్, పేరు మార్పిడి, చేయబడు. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
KMR: బీబీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్ రెడ్డిపల్లిలో బుధవారం జరిగిన సత్తయ్య హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఏఎస్పీ చైతన్య రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆమె సీఐ సంపత్ కుమార్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
BDK: చండ్రుగొండ మండలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, గ్రంధాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు, పలువురు ప్రముఖులతో కలసి గ్రామపంచాయతీలలో పర్యటించారు. ప్రతి గ్రామంలో అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.
ATP: కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో నాల్గవ పట్టణ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిన్న రాత్రి నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లను బ్రీత్ అనలైజర్‌తో తనిఖీ చేసి, పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తనిఖీలు రోజూ కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
SRD: కోహీర్ మండలంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 5.6 ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. జరా సంఘం 6.3, ఆల్గోల్ 6.4, న్యాల్కల్, జహీరాబాద్, సత్వార్ 6.9, మల్‌చెల్మ 7.0, మొగుడంపల్లి 7.9, నిజాంపేట, నల్లవల్లి 8.1, పుల్కల్ 8.3, సిర్గాపూర్ దిగ్వల్, కంగ్టి 8.9 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులో జరిగిన యువకుడి అత్యఘటనలో కామారెడ్డి జిల్లాకు చెందిన హనుమంతు (40) అరెస్టు చేసినట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. చిత్తు కాగితాలు, డబ్బాలు ఏరుకోవడానికి అడ్డు వస్తున్నాడని, ఏరుకున్న వాటిని దొంగలిస్తున్నాడని, కాళ్లు చేతులు బంధించి, గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు తెలిపారు. ఎస్సై శివానందం పాల్గొన్నారు
NTR: రాయితో దాడి చేసిన వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయ వివరాల ప్రకారం.. గుణదలకి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి 202లో తన ఇంటి వద్ద ఉంటున్న ఓ వ్యక్తిపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం విచారించగా నరసింహారావుకు ఆరు నెలలు జైలుశిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
PLD: రాష్ట్రంలోని గ్రామాల్లోని రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో, వినుకొండ నియోజకవర్గానికి సుమారు రూ. 8.61 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా మంజూరైన ఈ నిధులను నియోజకవర్గంలోని బాగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం కోసం వినియోగిస్తామని జీవీ అన్నారు.
కాకినాడ జిల్లాలో ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకూ 155 మందికి స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్గా తేలిందని డీఎంహెచ్వో తెలిపారు. బాధితులకు కాకినాడ జిజిహెచ్‌లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
TG: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,461 పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లటూన్స్ బృందాలు పాల్గొన్నాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేశారు. ఏదైనా సమస్య వస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 9240021456ని సంప్రదించవచ్చు.
PLD: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లా అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించారు. వివిధ శాఖల ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆమె 110 ఫైల్స్ స్వీకరించారు. అందులో 73 క్లియర్ చేశారు. ఫైల్స్ క్లియరెన్స్ లో కలెక్టర్ పనితీరుకు సీఎం చంద్రబాబు 5వ ర్యాంకు ఇచ్చారు.
KRNL: ఆదోని జిల్లాకోసం ఈ నెల 12 నుండి మంత్రాలయంలో ప్రారంభం కానున్న రిలే నిరాహార దీక్షలకు YCP మద్దతు ప్రకటించాలని BSS, JAC నాయకులు స్వామినాథం, ఆదము నాయకులు విజ్ఞప్తి చేశారు. వారు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ప్రజా సౌలభ్యం కోసం ఆదోని జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.