కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభ్యులు సంతాపం తెలిపారు. రేపు ఢిల్లీ రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మరోవైపు మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది.
ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘RBI గవర్నర్ సహా పలు కీలక పదవుల్లో మన్మోహన్ పనిచేశారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు. విలక్షణ పార్లమెంటేరియన్‌గా సేవలందించారు. ఎన్నో కీలక పదవులు అధిష్టించినా సామాన్య జీవితం గడిపిన మహానేత. దేశం తరపున ఆయనకు నివాళి అర్పిస్తున్నా’ అని తెలిపారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాకలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ముళ్లకంచెను అడ్డుగా వేశారని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి పుష్కరవనం నుంచి వెళ్లే దారి ఉండగా అటువైపు నుంచి వెళ్లకుండా కంచె వేసి భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముళ్లకంచెను తొలగించి భక్తులకు దర్శనం కల్పించాలని కోరారు.
మెదక్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన మరణం దేశానికి తీరని లోటని ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్: రేపు పాపన్నపేటలోని ఏడుపాయల దేవస్థానం నందు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు దేవస్థానం కార్యాలయం నందు టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. జనవరి 1 2025 నుంచి డిసెంబర్ 31 2025 వరకు దేవాలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం స్టీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లందరూ తలదించుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు సినిమా హీరోలను దేవుళ్లుగా చూస్తారని తెలిపారు. హీరోల పక్కన ఉండే వారు మంచి సలహాలు ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగేదికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
VZM: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెగుళ్లు వల్ల, తుఫాన్ ప్రభావం వల్ల వరి, అపరాలు పంటల రైతులు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం ఈ నష్టం పై సమగ్రంగా పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు.
సత్యసాయి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. పట్టణాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ ఉదయం వరకు జిల్లాలో 157.2 mm వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 26.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కదిరిలో 21, గాండ్లపెంటలో 9.8, ఆమడగూరులో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
NGKL: కల్వకుర్తి ప్రభుత్వ కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పండిత్ రావు తనిఖీ చేశారు. మార్కెట్ రికార్డులను పరిశీలించారు. మార్కెట్‌లో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా సాధించిన ప్రగతికి మన్మోహన్ పునాది వేశారు. ఇరుదేశాల పౌర అణు సహకార ఒప్పందాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోతాయి. ఆయనొక గ్రేట్ ఛాంపియన్’ అని పేర్కొంది.
ELR: యువత క్రీడల్లో రాణించాలని చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ అన్నారు.ఇటీవల కర్నూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జావెలిన్, డిస్కస్ త్రో క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైన కుమారి వి. భార్గవి, జి. నీలమాలను ఎమ్మెల్యే సత్కరించారు. క్రీడలు ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.
AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘మన్మోహన్ మరణం అత్యంత బాధాకరం. ఆయన మహోన్నత నాయకుడు. భారతదేశ ఆర్థిక శిల్పి. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
WNP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
SRD: పటాన్ చెరు మండలం పోచారం గ్రామ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
VZM: గజపతినగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి గొప్ప సంస్కరణలు చేపట్టారని కొనియాడారు.